కాలనీల అభివృద్ధికి పెద్దపీట
పట్టణంలోని ప్రతి కాలనీను అభివృద్ధి చేస్తూ,మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పట్టణంలోని ప్రతి కాలనీను అభివృద్ధి చేస్తూ,మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 6 వ వార్డు శ్రీనివాస కాలనీలో 20.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని,దశల వారిగా అన్ని వసతులను కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం కాలనీలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్,ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ,కౌన్సిలర్ తిరుమల వెంకటేష్,నాయకులు రాజేందర్ రెడ్డి,గట్టు వెంకట్ రెడ్డి,బాలకృష్ణ,రాజసింహుడు,అనసూయ,శ్రీదేవి,వనజ,జయమ్మ,జ్యోతి,వెంకటస్వామి గౌడ్,మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,ఇఇ బస్వరాజు,డిఇ సందీప్,తదితరులు పాల్గొన్నారు.