పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
పల్లెల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో పనుల జాతరతో అభివృద్ధి పనుల ప్రారంభం కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.
దిశ, వంగూరు : పల్లెల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో పనుల జాతరతో అభివృద్ధి పనుల ప్రారంభం కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం వంగూర్ మండలం మిట్ట సదగొడు, ఉల్లంపల్లి గ్రామంలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో..పల్లెల్లో పనుల జాతరకు రంగం సిద్ధమైందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.