కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
నారాయణపేట మండలం లింగంపల్లి సమీపంలో భాగ్యలక్ష్మి కాటన్ మిల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట మండలం లింగంపల్లి సమీపంలో భాగ్యలక్ష్మి కాటన్ మిల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైతుల నుంచి సేకరించిన పత్తి అగ్నికి ఆహుతి అయింది. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. కాగ సుమారు 8 వేల క్వింటాళ్లు పత్తి దగ్ధం అయినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందా ? మరి ఏ ఇతర కారణాలు ఉన్నాయో తెలియాలి.