కొల్లాపూర్ తో నాకు ఎంతో అనుబంధం ఉంది
కొల్లాపూర్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని సినీ హీరో విజయ్ దేవరకొండ వెల్లడించారు.
దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని సినీ హీరో విజయ్ దేవరకొండ వెల్లడించారు. తాతయ్య ఇక్కడే ఉద్యోగం చేస్తున్న సమయంలో మా అమ్మ, మేనమామ ఇదే పాఠశాలలో ఒక ఏడాది చదివారని ఆయన గుర్తు చేశారు. కొల్లాపూర్ ఆర్ ఐ డి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో భాగంగా..రెండవ రోజు గురువారం ముఖ్యఅతిథిగా విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. సినీ హీరో విజయ్ కి అభిమానులు పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. రాజా బంగ్లా వద్ద ఉత్సవాలకు తరలివచ్చిన పూర్వ విద్యార్థులు యువకులకు మంత్రి జూపల్లి కృష్ణారావు మై హోమ్ గ్రూప్స్ చైర్మన్ జూపల్లి రామేశ్వరావు తో కలిసి విజయ్ దేవరకొండ తలవంచి వందనం చేశారు. అనంతరం శిథిలావస్థలో చేరుకున్న ఆర్ఐడి హై స్కూల్ ను పునర్నిర్మాణం కోసం స్వచ్ఛందంగా నిధులను సమకూర్చిన రామేశ్వరావుతో కలిసి పాఠశాలను విజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించిన అనంతరం ఉపాధ్యాయ బృందంతో ఆయన చర్చించారు. అనంతరం రాజా బంగ్లాలో ఉత్సవాల కమిటీ చైర్మన్ డాక్టర్ కటికనేని సాయి ప్రసాద్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సినీ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..పతి ఏడాది పంటలు చేతికి రాగానే సింగోటం లక్ష్మీనరసింహస్వామి కి మొక్కులు సమర్పిస్తుండే జ్ఞాపకాలు గుర్తున్నాయని పేర్కొన్నారు. ఇకనుంచి కొల్లాపూర్ కు వస్తుంటానని ఆయన స్పష్టం చేశారు. ఒకే స్కూల్ నుంచి 14 మందిని వివిధ విభాగాల్లో వైస్ చాన్సర్లుగాను, అందించిన పాఠశాల గొప్పతనాన్ని గూర్చి విజయ్ దేవరకొండ కొనియాడారు.
ఇదే కాకుండా 1972 _74 లో ఇదే పాఠశాలలో చదివిన మై హోమ్ గ్రూప్స్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఎంతో ఖ్యాతి గాంచారని, పారిశ్రామికవేత్తగా రాణిస్తూ ఎంతో వేలాదిమంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుండడం గొప్ప విషయం అన్నారు. భవిష్యత్తు కోసం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల సీని హీరో విజయ్ దేవరకొండ అభినందించారు. ఈ స్కూల్ నుంచి ఎందరో హీరోలుగాను, పారిశ్రామికవేత్తలుగాను, ప్రొఫెసర్లుగాను, డాక్టర్లు గాను వైస్ ఛాన్స్లర్ గాను రాణిస్తారని తాను ఆకాంక్షిస్తున్నట్లు సినీ హీరో విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో తిరుపాలు, వెంకట్ దాస్ రచించి పాడిన పాటల సిడిని, విజన్ 2030,2040,2050 రూపొందించిన డాక్యూ మెంటరిని సినీ హీరో ఆవిష్కరించారు. అనంతరం ఉత్సవాల నిర్వాహకులు హీరో విజయ్ కి శాలువా కప్పి మెమొంటోను బహుకరించి ఘనంగా సన్మానించారు. 96 ఏళ్ల పూర్వ విద్యార్థులతో కలిసి ఆర్ ఐడి గోల్డెన్ జూబ్లీ సంబరాలు చేయడంతో వండర్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధి బృందం ధ్రువీకరణ పత్రం, ఫీల్డ్ ను కమిటీ నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ రావు, ఢిల్లీ బిట్స్ వై ఛాన్స్లర్ డాక్టర్ రామ్ గోపాల్ రావు, ప్రొఫెసర్, జయరాం రెడ్డి, మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరావు, తదితరులు మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా జనగామ కు చెందిన మహిళ కళాకారునిలు తలపై బోనం కుండతో కోలాటాలు వేయడం సబికులను ఆకట్టుకుంది. అలాగే ముష్టిపల్లి కోలాటం మహిళా కళాకారునిలు, లంబాడి మహిళలు నృత్యాలు, గంగిరెద్దు ఆటలు, యాదగిరి ఆధ్వర్యంలో కళాకారులు నృత్య ప్రదేశంలో చేశారు.