బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి
బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే తీవ్రంగా కృషి చేశారని డీసీసీ మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్ అన్నారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే తీవ్రంగా కృషి చేశారని డీసీసీ మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి..నివాళులర్పించి మాట్లాడారు. ఆదివాసీలు,గిరిజనులకు విద్యను అందించడానికి అయన సొంత ఖర్చుతో పాఠశాలలు నిర్వహించారని,ఆనాటి భూస్వాములు,జమీందార్ల దోపిడీని అరికట్టడానికి అలుపెరుగని పోరాటం చేశారని అన్నారు. పూలే ఆశయ సాధన కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సాయిబాబా,ఫకృద్దీన్ ఖురేషి,రాములు యాదవ్,ఫహిం,ఆక్సర్,ఖాదర్ పాష,అంతయ్య,బాలస్వామి,లక్ష్మి,తాబలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పూలేహెర్,ఇద్రీస్,తదితరులు పాల్గొన్నారు.