నాలుగు రోజులుగా ఉపాధ్యాయులు లేరు…

మండల పరిధిలోని తాళం కేరి గ్రామంలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు పాఠశాలకు వెళ్లని పరిస్థితి నెలకొంది.

Update: 2024-07-06 15:50 GMT

దిశ, మాగనూర్: మండల పరిధిలోని తాళం కేరి గ్రామంలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు పాఠశాలకు వెళ్లని పరిస్థితి నెలకొంది. ఈ గ్రామ పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉన్న ఒక ఉపాధ్యాయుడు ఇటీవల బదిలీ కావడంతో ఒకటి రెండు రోజులు ఇతర ఉపాధ్యాయులు వచ్చి బోధించారు. గత నాలుగు రోజుల నుంచి ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోవడంతో పిల్లల పరిస్థితి దారుణంగా తయారైనట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరగతులు ఏమి చెప్పకుండా కేవలం మధ్యాహ్నం సమయంలో అన్నం పెట్టి ఇంటికి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాధికారులకు సమస్యను తెలిపిన స్పందించడం లేదని తెలుస్తుంది. ప్రైవేటు పాఠశాలలో చేర్పించే స్తోమత లేక ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే కనీసం అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి తాళం కేరి గ్రామానికి ఉపాధ్యాయులను నియమించి విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Similar News