ఆయన చేరికతో అచ్చంపేటలో కాంగ్రెస్ మరింత బలపడనుందా !
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం కేంద్రానికి చెందిన తనకంటూ ఒక గుర్తింపు ఉన్న నాయకుడు లాయర్ రాజేందర్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో గాంధీ భవన్ కు చేరుకున్నారు.
దిశ, అచ్చంపేట : మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం కేంద్రానికి చెందిన తనకంటూ ఒక గుర్తింపు ఉన్న నాయకుడు లాయర్ రాజేందర్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో గాంధీ భవన్ కు చేరుకున్నారు.
ఉద్యమ సమయంలో..
తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో నియోజకవర్గంలో లాయర్ రాజేందర్ అలుపెరుగని పోరాటం చేస్తూ రాష్ట్ర అధినాయకత్వం కేసీఆర్, కేటీఆర్, అలాగే హరీష్ రావు సైతం గుర్తుపట్టే స్థాయిలో తన ఉద్యమాన్ని కొనసాగించారు. తెలంగాణ ప్రభుత్వంలో గడిచిన తొమ్మిది ఏళ్లలో ఉద్యమ నాయకుడికి తగిన ప్రాధాన్యత దక్కకపోవడం అలాగే నాయకత్వం గుర్తించకపోవడంతో మొన్నటి వరకు స్తబ్దతగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో లాయర్ రాజేందర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలోకి రావాలని కొందరు ప్రయత్నాలు చేసినట్లుగా తెలిసింది. ఉన్నట్టుండి రాజేందర్ గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ స్థానిక మాజీ శాసనసభ్యుడు డాక్టర్ వంశీకృష్ణ నాయకులతో కలిసి దర్శనం ఇవ్వడంతో అచ్చంపేట నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీకి..
సీనియర్ నాయకుడు మలిదశ ఉద్యమ పోరాటం కొనసాగించి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన లాయర్ రాజేందర్ ఇంతకాలం స్తబ్దగా ఉంటూ.. తన క్యాడర్ తో నేడు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నేపథ్యంలో అచ్చంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.