హెల్మెట్ శ్రీ రామ రక్షా..వినూత్నంగా హెల్మెట్ ఆకారంతో నిర్మాణం

ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్ రావు అన్నారు.

Update: 2024-12-22 15:23 GMT

దిశ, వనపర్తి టౌన్: ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్ రావు అన్నారు. హెల్మెట్ శ్రీరామ రక్షా అని తెలిపారు. ఆదివారం పోలీస్ స్టేషన్ లో ఎస్సై జలంధర్ రెడ్డి వినూత్నంగా హెల్మెట్ తో కూడిన ఆకారంతో చేపట్టిన నిర్మాణాన్ని డిఎస్పి వెంకటేశ్వర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో..స్టేషన్ కి వచ్చే బాధితులకు, వాహనదారులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న ప్రయత్నాలకు రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డిని ఆయన అభినందించారు. ప్రయాణికులు అతి వేగంతో వెళ్లి ..ఎందరో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. నిదానమే ప్రధానమని గుర్తు చేశారు. ప్రతి ప్రయాణికుడు హెల్మెట్ ధరించి కుటుంబానికి ఆసరాగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి సీఐ కృష్ణ, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News