ఏసుక్రీస్తు లోక రక్షకుడు

ఏసుక్రీస్తు లోకరక్షకుడని, ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు.

Update: 2024-12-22 14:14 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : ఏసుక్రీస్తు లోకరక్షకుడని, ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం పట్టణంలోని కల్వరీ ఎంబీ చర్చిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'ప్రేమ విందు' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అని, ఆయన చూపిన మార్గంలో అందరం కలిసి పయనిద్ధామని, సంతోషంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

    అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి, ఆయన ప్రేమ విందు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎంబీసీ చర్చి చైర్మన్ ఎస్.వరప్రసాద్, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, అడిషనల్ ఎస్పీ రాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యం వైపు మీ దృష్టి సారించాలి....

ఒక ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధించుకునే దిశగా దృష్టి సారించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల పరిధిలోని సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ వసతి గృహాన్ని సందర్శించి, విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకుని వారితో ముచ్చటించారు. సమయం చాలా విలువైనదని, పోయిన సమయాన్ని తిరిగి తెచ్చుకోలేమని, చదువు పైనే దృష్టి సారించి మంచి ర్యాంకులతో డిగ్రీ, పీజీ లో పాసైతే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడవచ్చని ఆయన హితవు పలికారు. అనంతరం వసతిగృహం మైదానంలో ఎండిన చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, సిరాజ్ ఖాద్రీ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, అజ్మత్ అలి, ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు. 


Similar News