అచ్చంపేటలో రేపు భారీ నిరసన ర్యాలీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మండిపడ్డారు.
దిశ, అచ్చంపేట : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి,పిసిసి పిలుపు మేరకు..నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. నాయకులు ఎవరైనా సభ్య సమాజం గౌరవించేలా మన వ్యాఖ్యలు ఉండాలని అన్నారు. రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడిపై ఉద్దేశపూర్వకంగా బీజెపి పార్టీ అనాలోచిత విధానంతోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెద్దల సభలో అంబేద్కర్ ను అగౌరవ పరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్ రెడ్డి, మెగా రెడ్డి, పాల్గొంటున్నారన్నారు. కావున నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, అలాగే ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ లాయర్ రాజేందర్, మండల కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు కట్ట గోపాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.