ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపడతా : ఎమ్మెల్యే

రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల పై నూతన శకానికి నాంది పలికారు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి. జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

Update: 2024-06-18 15:33 GMT

దిశ, జడ్చర్ల : రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల పై నూతన శకానికి నాంది పలికారు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి. జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలు పున ప్రారంభించడంతో ప్రభుత్వ పాఠశాలలలో చదివే నిరుపేద విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తన సొంత డబ్బులతో జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా 254 ప్రభుత్వ పాఠశాలల్లో కోటి 75 లక్షల విలువైన (షూస్) బూట్లను 53,000 పైచిలుకు విద్యార్థులకు అందజేయబోతున్నామని అవి కూడా బ్రాండ్ (బాటా) కంపెనీకి చెందిన బూట్లను మాత్రమే పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

అంతేగాక విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఎల్ఈడి టీవీలను, వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన అన్నారు. వాటి కోసం ప్రత్యేకంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సంబంధిత విద్యాధికారుల ప్రోత్సాహంతో పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. పాదయాత్ర సందర్భంగా ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే ఈ కార్యక్రమం చేపట్టానని ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఎక్కడ మొదలు పెట్టలేదని తాను మాత్రమే నిరుపేద విద్యార్థుల కోసం, వారి భవిష్యత్తు కోసం చేయడం జరుగుతుందని అన్నారు. ఇది ఇంతటితో ఆగిపోకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని రెండువేల మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు వారికి కూడా అవసరమైన అందించబోతున్నానని తెలిపారు.

అదేవిధంగా జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు చేపడతానని, ఇందులో భాగంగానే అతి త్వరలోనే ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలతో సమావేశం నిర్వహించి విధుల నియంత్రణకు చర్యలు చేపడతానని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం నుంచి మరో 3000 ఓట్లు వచ్చి ఉంటే ఎంపీగా చల్లా వంశీచంద్ రెడ్డి గెలిచేవారని ఏదైనా ప్రజా తీర్పును గౌరవిస్తామని, పాలమూరు ఎంపీగా గెలిచిన డీకే అరుణమ్మ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యానందం, బుక్క వెంకటేశం, వెంకటయ్య ,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

Similar News