కిరాణా షాపుల్లో పాడైపోయిన వస్తువుల అమ్మకాలు..

కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో విచ్చలవిడిగా కిరాణా షాపులు నెలకొల్పి చిన్న పిల్లలు తినే చిరుధాన్యాలు, వస్తువులు పాడై పోయినవి ఎక్స్పైరీ డేట్స్, అమ్ముతున్నారని సమాచారం ఇవ్వడంతో వనపర్తి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిణి నీలిమ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Update: 2024-06-26 14:38 GMT

దిశ, కొత్తకోట : కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో విచ్చలవిడిగా కిరాణా షాపులు నెలకొల్పి చిన్న పిల్లలు తినే చిరుధాన్యాలు, వస్తువులు పాడై పోయినవి ఎక్స్పైరీ డేట్స్, అమ్ముతున్నారని సమాచారం ఇవ్వడంతో వనపర్తి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిణి నీలిమ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మధనాపురం రోడ్డులో ఉన్న పార్థ సారథి కిరాణ షాప్ ను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిని నీలిమ మాట్లాడుతూ ఈనెల 25వ తేదీన వినియోగదారుడు ఫిర్యాదు చేశాడని, తాము వచ్చి కిరాణా షాపుల్లో తనిఖీ చేయగా నిజమని తేలిందని తెలిపారు. తేదీలు అయిపోయిన చిప్స్ పాకెట్స్ తో పాటు బిస్కెట్లు, అల్లం వెల్లుల్లి పేస్టు తదితర వస్తువులు ఉన్నాయని, కొన్ని శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపి తదుపరి చర్యలు చేపడతామని, కిరాణ షాపుల్లో పాడై పోయిన వస్తువులు ఎవరైనా అమ్మిన యెడల వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని నీలిమ తెలిపారు.


Similar News