నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్..

బస్సులో జారవిడుచుకున్న సెల్ ఫోన్ ఆధార్ కార్డును బాధిత వ్యక్తికి బస్ డ్రైవర్ అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు.

Update: 2024-06-26 16:22 GMT

దిశ, వీపనగండ్ల : బస్సులో జారవిడుచుకున్న సెల్ ఫోన్ ఆధార్ కార్డును బాధిత వ్యక్తికి బస్ డ్రైవర్ అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ భగవాన్ దాస్ కొల్లాపూర్ వెళ్లే బస్సుకు డ్రైవర్ గా వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో అదే బస్సులో కొల్లాపూర్ నుంచి వీపనగండ్ల గ్రామానికి చెందిన కురువ బాలకృష్టి ప్రయాణించి మొబైల్ ఫోన్, ఆధార్ కార్డును జారవిడుచుకుని వీపనగండ్లలో బస్సు దిగి వెళ్ళాడు. బస్సులో పోగొట్టుకున్న ఫోన్, ఆధార్ కార్డును, ఆధార్ కార్డులోని అడ్రస్ తో బస్ డ్రైవర్ భగవాన్ దాస్ కురువ బాలకృష్ణకి తన మొబైల్ ఫోన్ అందజేశారు. డ్రైవర్ నిజాయితీని చాటుకోవటాని గ్రామస్తులు అభినందించారు.


Similar News