దిశ ఎఫెక్ట్.. లాంగ్ లీవ్ లో ఆ ఐదుగురు..

మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో జరిగిన డబుల్ బెడ్ రూమ్ ల అవతవకల పై ఉన్నత అధికారులు సీరియస్ గా దృష్టి సారించారు.

Update: 2024-06-26 16:17 GMT

దిశ, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో జరిగిన డబుల్ బెడ్ రూమ్ ల అవతవకల పై ఉన్నత అధికారులు సీరియస్ గా దృష్టి సారించారు. గత పది రోజులుగా దిశలో వస్తున్న వార్త కథనాల ఆధారంగా డబుల్ బెడ్ రూమ్ ల పై భారి మెుత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆధారాలు బయటికి వస్తున్నాయి. ఈ అక్రమ వ్యవహారం సాగించిన మహబూబ్ నగర్ అర్బన్ కార్యాలయంలో పనిచేసిన 5 గురు సిబ్బందికి ఉన్నత అధికారులు షోకాజ్ నోటిసులను జారీ చేశారు. ఈ తతంగాన్ని అంతా ముందే పసిగట్టిన గత మహబూబ్ నగర్ అర్బన్ తహశీల్దార్, ఓ ఆర్.ఐ ఇతర అధికారులు ప్రస్తుతం వారు పనిచేస్తున్న కార్యాలయాల్లో లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్లినట్టు తెలుస్తుంది. మహబూబ్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించి ఏలాంటి ప్రోసిడింగ్ లేకుండా లక్కిడీప్ ని కూడా తీయకుండానే పెద్దమెుత్తంలో ఇండ్లను అడ్డగోలుగా పంచేశారు.

ప్రస్తుతం మహబూబ్ నగర్ కు సంభంధించిన డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ వివరాలు, వినతులకు సంభంధించిన ఏ ఆధారం కూడా అర్బన్ కార్యలయంలో లేకపోవడంతో ప్రస్తుతం ఉన్నత ఆధికారులు అంతా తలలు పట్టుకుంటున్నారు. ఈ వ్యవహారం పై సీరియస్ గా ఉన్న మహబూబ్ నగర్ ఉన్నత అధికారులు పాలమూరు అర్బన్ కార్యాలయ అధికారుల పై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం చిన్నచింత కుంటలో పని చేస్తున్న ఓ ఆధికారి సైతం ఈ అక్రమ డబుల్ బెడ్ రూమ్ ల వ్యవహారంలో కీలకంగా వ్యవహారించిట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ అధికారికి కూడ మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయం నుంచి డబుల్ బెడ్ రూమ్ ల వ్యవహారంలో షోకాజ్ నోటీసులు అందినట్లు తెలుస్తుంది. ఇందులో ఒకరిద్దరు ఉద్యోగ సంఘాల్లో కీలక బాధ్యులుగా వ్యవహరిస్తుండతో గత వారం రోజుల నుంచి లాంగ్ లీవ్ లు పెట్టి మరి పైరవీలకు తెరలేపుతున్నారు అనే వార్తలు సైతం బయటకు వస్తున్నాయి. ఈ కారణంగానే షోకాజ్ నోటీసులకు సంబందించిన విషయం అధికారులు బయటకు పొక్కనివ్వడం లేదు.

Similar News