జూలై‌ 1 నుండి కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలి..

జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసే క్రమంలో స్టేషన్ ల ఎస్హెచ్ఓ లు, స్టేషన్ రిటర్లు, CCTNS రైటర్స్ కొత్త చట్టాల ఎస్ఓపీనీ అనుసరించి కేసులు నమోదు చేయ్యడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, సాక్ష్యాలను సేకరించి కోర్టులలో చార్జీ షీట్ వేయాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు పోలీస్ అధికారులను, స్టేషన్ రైటర్స్ ను ఆదేశించారు.

Update: 2024-06-29 12:30 GMT

దిశ, గద్వాల : జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసే క్రమంలో స్టేషన్ ల ఎస్హెచ్ఓ లు, స్టేషన్ రిటర్లు, CCTNS రైటర్స్ కొత్త చట్టాల ఎస్ఓపీనీ అనుసరించి కేసులు నమోదు చేయ్యడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, సాక్ష్యాలను సేకరించి కోర్టులలో చార్జీ షీట్ వేయాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు పోలీస్ అధికారులను, స్టేషన్ రైటర్స్ ను ఆదేశించారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ ల ఉన్న ఎస్సైలకు, ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో పనిచేస్తున్న రైటర్స్ కు, CCTNS రైటర్స్ కు డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నూతన చట్టాల అమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేకరించాల్సి సాక్ష్యాలు తదితర అంశాల గురించి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు ముఖ్యఅతిథిగా హాజరై ఎస్సై లకు, స్టేషన్ రైటర్స్ కు, CCTNS రైటర్స్ కు జూలై 1 వ తేది కొత్త చట్టాలను అనుసరించి కేసులు నమోదు చెయడం, సాక్ష్యాలను సేకరించడం, కోర్టులలో చార్జీ షీట్ వేసే క్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తల పై పలు సూచనలు చేశారు.

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జులై 1 నుంచి కొత్త చట్టాలను అనుసరించి కేసులు నమోదు చెయ్యాలని, కొత్త చట్టాల SOP ని అనుసరించి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఇతర సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించి కోర్టులలో చార్జీ షీట్ వేయడం ద్వారా నేరస్థులకు శిక్షలు పడే శాతాన్ని పెంచాలని అధికారులకు, రైటర్స్ కు సూచించారు.

కొత్త చట్టాలను అనుసరించి ఆయా సెక్షన్ ల ద్వారా కేసులు నమోదు చేసే క్రమంలో, సాక్ష్యాధారాలను సేకరించే క్రమంలో ఏలాంటి సందేశాలను ఉన్నతాధికారులను ఫోన్ లో సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆదేశించారు.

పకడ్బందీగా సాక్ష్యాధారాలను సేకరించి, విచారణ చేపట్టి కోర్టులో చార్జ్ షీట్ సబ్మిట్ చెయడం ద్వారనే నేరస్థులకు శిక్షలు పడే శాతాన్ని పెంచవచ్చని ఆ దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో సుమ్మన్స్ ను ప్రాపర్ గా సర్వ్ చెయ్యాలని, NBWs వారెంట్స్ సర్వ్ చెయ్యాలని, ఎప్పటికప్పుడు ఆయా కేసులకు సంబంధించిన CC (కోర్టు కేలండర్) నంబర్స్ పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గద్వాల్, శాంతి నగర్ సీఐలు భీమ్ కుమార్, రత్నం, ఎస్బీ ఇన్స్పెక్టర్ జంములప్ప, అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై, వివిధ విభాగాల ఎస్సైలు అన్ని పోలీస్ స్టేషన్ ల రైటర్స్, CCTNS రైటర్స్ పాల్గొన్నారు.

Similar News