నేటి నుంచి పిల్లలమర్రి చూసేందుకు అనుమతి

దేశంలోనే ఎంతో పేరోంది, పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉండి, మహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లలమర్రి ని నేరుగా చూడడానికి మంగళవారం నుంచి అనుమతిస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు.

Update: 2024-07-01 15:40 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: దేశంలోనే ఎంతో పేరోంది, పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉండి, మహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లలమర్రి ని నేరుగా చూడడానికి మంగళవారం నుంచి అనుమతిస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ మహా వృక్షం 700 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. భారతదేశంలోనే మూడవదిగా చరిత్ర చెబుతుంది. పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చే ఈ వృక్షాన్ని ఇకపై తాకకుండా చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Similar News