మాస్టర్ మైండ్ స్కూల్ కు అసలు ప్రిన్సిపాల్ ఉన్నారా..?

మండల కేంద్రంలో ఉన్న మాస్టర్ మైండ్ స్కూల్ కు అసలు ప్రిన్సిపల్ ఉన్నాడా లేడా ఆ ప్రిన్సిపాల్ కు ఉన్న విద్యార్హత ఏంటి తెలుపాలని బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ డిమాండ్ చేశారు.

Update: 2024-07-03 15:41 GMT

దిశ, బిజినేపల్లి : మండల కేంద్రంలో ఉన్న మాస్టర్ మైండ్ స్కూల్ కు అసలు ప్రిన్సిపల్ ఉన్నాడా లేడా ఆ ప్రిన్సిపాల్ కు ఉన్న విద్యార్హత ఏంటి తెలుపాలని బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం బీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ మాస్టర్ మైండ్ స్కూల్ లో ప్రభుత్వ పరమైన ఎలాంటి నిబంధనలు అమలు కావడం లేదని విమర్శించారు. మాస్టర్ మైండ్ స్కూల్ కు అసలు ప్రిన్సిపాల్ అనే వ్యక్తే లేడని అన్నారు. ఇంచార్జ్ అనే పేరుతో ఎలాంటి అర్హత లేని సుబ్బారెడ్డి అనే వ్యక్తి చేతిలో విద్యార్థుల భవిష్యత్తు పెట్టడం అనేది దారుణమైన విషయం అని అన్నారు. సుబ్బారెడ్డి విద్యా అర్హతలు ఏంటో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. PET అనే వ్యక్తి అసలు PET ఆ, డ్రైవర్ అ అని ప్రశ్నించారు.

ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సు డ్రైవర్ గా - స్కూల్ వేళల్లో PET గా పని చేయడం ఏంటని నిలదీశారు. విద్యా బోధన చేసే ఫ్యాకల్టీకి కూడా అసలు ఎలాంటి అర్హతలు లేవని పేర్కొన్నారు. మాస్టర్ మైండ్ స్కూల్లో అధిక ఫీజుల పై జిల్లా విద్యాధికారి దృష్టి సారించాలని కోరారు. ఇట్టి విషయాల అన్నింటినీ పై మండల విద్యా శాఖాధికారి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. స్కూల్ బిల్డింగ్ గా కూడా సరిగ్గా లేని మాస్టర్ మైండ్ స్కూల్ ను సీజ్ చేసే దాకా బీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నిరంతర పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం వినతిపత్రాలు మాత్రమే ఇస్తున్నామని, త్వరలో స్కూల్ సీజ్ చేసే దాకా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అంతకుముందు మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్, అసెంబ్లీ కమిటీ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్, అసెంబ్లీ కమిటీ ఉపాధ్యక్షులు పరుశరామ్, బిజీనాపల్లి మండల అధ్యక్షులు రాంచందర్, బీఎస్ఎఫ్ నాయకులు శివ, రాజు తదితరులు పాల్గొన్నారు.


Similar News