సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఆవేదనలు..

ఎలాంటి విధులు నిధులు లేని పదవులైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేయాలని కోరుతూ బుధవారం మండల కార్యాలయంలో నిర్వహించిన కోస్గి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ పోషప్ప, జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డిలు తమ ఆవేదనలు వ్యక్తం చేశారు.

Update: 2024-07-03 16:41 GMT

దిశ, కోస్గి : ఎలాంటి విధులు నిధులు లేని పదవులైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేయాలని కోరుతూ బుధవారం మండల కార్యాలయంలో నిర్వహించిన కోస్గి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ పోషప్ప, జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డిలు తమ ఆవేదనలు వ్యక్తం చేశారు. తమ పదవీకాలం నేటితో ముగిస్తుండడంతో గత ఐదేళ్లుగా తాము ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా బరిలో ఉంటూ పేరుకు పదవులు పొందామే తప్ప ప్రజలకు చేసింది శూన్యమని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎలాంటి విధులు నిధులు లేని ఇలాంటి చెత్త పదవులతో ప్రజలకు సేవ ఏ విధంగా చేయగలమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ నాయకుడైనా ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ వారి సమస్యలను పరిష్కరించి ప్రజల మన్ననలను పొందేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పదవులు దోహదపడతాయన్నారు. ఇదిలా ఉండగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు మాత్రం ఎందుకు పనికిరాని పదవులు గా ఈ వ్యవస్థలో ఉండడం సరికాదని వెంటనే ఉన్నత స్థాయి నాయకులు అధికారులు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి ఈ పనికిరాని పదవుల గలిగిన వ్యవస్థను శాశ్వతంగా నిర్మూలించాలని తమ అక్రోసాన్ని వెళ్ళగక్కారు. రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ నాయకుడు పోటీచేసే అవకాశం లేదని అన్నారు.

పోటీ చేసి ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా గెలుపొందిన వీరికి కనీసం గ్రామ పంచాయతీ నుంచి మండల స్థాయిలో ఎక్కడ వీరికి కూర్చునేందుకు కార్యాలయాలు లేక కుర్చీ లు లేక అవమానాలు భరించాల్సిన దుస్థితి ఏర్పడుతుందని అన్నారు. పనికిరాని పదవుల కోసం ప్రయాసపడి ప్రజల చేత ఎన్నుకోబడిన ఫలితం లేని ఈ పదవులు గత ఐదేళ్ల తమ కాలంలో తమను బాధించాయే తప్ప మేము ప్రజలకు చేసింది శూన్యమని అన్నారు. తమ పదవీకాలం నేటితో ముగిస్తుండడంతో ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమం సిగ్గుతో తల దించుకొని, అవమానాలు భరించి తమ పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నామని, సభాముఖంగా ఇలాంటి దుస్థితిని మార్చేందుకు అవసరమైన ఈ చట్టాలను మార్పు చేస్తూ ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యవస్థను ఉన్నపలంగా రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. 


Similar News