సైబర్ నేరగాళ్లకే ధమ్కీ.. పంతులమ్మ డేర్‌కి హ్యాట్సాప్

మేం ముంబాయి నుంచి క్రైం బ్రాంచి నుంచి మాట్లాడుతున్నాం.

Update: 2024-06-29 03:41 GMT

దిశ, మక్తల్: మేం ముంబాయి నుంచి క్రైం బ్రాంచి నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరుతో బొంబాయి నుండి థాయిలాండ్‌కు మా ఇంటర్నేషనల్ కొరియర్ పార్సిల్ సర్వీసు నుంచి డ్రగ్స్ పార్సిల్ వెళ్లింది. మీపై కేసు నమోదయ్యింది. మీరు ఇక్కడికి వచ్చి కాంప్లెంట్ రాసిస్తే సరిపోతుంది. లేదా మిమ్మల్ని అరెస్టు చేస్తారు. రేపు మీరు ఇక్కడి రండి అని మక్తల్ పట్టణానికి చెందిన ఓ పంతులమ్మకు హిందిలో మగ గోంతుతో 9198154627, 8980596518 నెంబర్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్‌ను రికార్డు చేసింది. తాము తెలంగాణ వాసులం అని అక్కడికి రాలేమని చెప్పడంతో పర్వాలేదు తామే మీకు సహాయం చేస్తాం అందుకు ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు వివరాలు పంపించాలన్నారు.

దానికి మేము సరైన సమాధానం రాసి పంపిస్తాము మీ మీద ఏ కేసు రాకుండా నమోదు కాకుండా చూస్తామని సైబర్ నేరగాళ్ళు చెప్పారు. దీనికి పంతులమ్మ భయపడకుండా మా అన్న క్రైమ్ బ్రాంచ్‌లో పనిచేస్తాడు నీ ఫోన్ నెంబర్ వివరాలు చెప్తే సరైన వివరాలు అక్కడి వచ్చి ఇస్తాడని చెప్పి ధమ్కీ ఇచ్చింది. దీంతో ఈ ఫోన్ నెంబర్‌కు ఇన్‌కమింగ్ కాల్ రాదు అని చెప్పడంతో ఇతర ఫోన్ నెంబర్లు వివరాలు ఇవ్వండని ధైర్యంగా అడిగింది. దీంతో షాక్ కు గురైన సైబర్ కేటుగాడు ఫోన్ కట్ చేశాడు. గతంలో ఓసారి ఇలాగే సైబర్ నేరగాల నుండి కాల్ రాగా ‘దిశ’ దృష్టికి తీసుక రాగా ఈ టెక్నిక్ చెప్పడం జరిగింది. మళ్లీ ఇదే టెక్నిక్‌ని రెండు రోజుల క్రితం సైబర్ నేరగాళ్ల నుండి వచ్చిన ఫోన్ కాల్‌కు ఉపయోగించడంతో అవతల సైబర్ నేరగాడు ఖంగు తిని ఫోన్ కట్ చేశాడు.

Similar News