‘మరోసారి BRS, బీజేపీ మధ్య ఒప్పందం బట్టబయలు’.. ఏలేటి వ్యాఖ్యలకు దానం స్ట్రాంగ్ కౌంటర్

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు స్పీడ్ పోస్ట్ పంపుతామని బీజేపీఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

Update: 2024-07-01 13:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు స్పీడ్ పోస్ట్ పంపుతామని బీజేపీఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు దానం నాగేందర్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై అనర్హత వేటు వేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పీకర్‌కు స్పీడ్ పోస్ట్ పంపుతారంటా.. ఆయన ఏ హోదాలో ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మహేశ్వర్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం మరోసారి బయటపడిందన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకున్నాయని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి డైవర్ట్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఫిరాయింపులు ప్రోత్సహించిందే బీఆర్ఎస్స్ అని.. ఫిరాయింపులపై మాట్లాడే అర్హత ఆ పార్టీ నేతలకు లేదని దానం కౌంటర్ ఇచ్చారు. 


Similar News