50 మంది కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా.. పరారీలో డ్రైవర్!

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం గ్రామ శివారులో కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడింది.

Update: 2024-06-29 06:03 GMT

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం గ్రామ శివారులో కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడింది. గాయపడిన వారు తెలిపిన వివరాల ప్రకారం.. కోడూరు మండల కేంద్రానికి చెందిన బొలేరో డ్రైవర్ మహేష్ శనివారం ఉదయం కలుపు తీయడానికి అదే గ్రామానికి చెందిన కొంతమంది కూలీలను, మహాసముద్రం గ్రామానికి చెందిన మరి కొంతమంది కూలీలను రెండు ఊర్లలో కలిపి 50 మంది కూలీలను తన బొలెరోలో ఎక్కించుకొని తాడూరు మండల కేంద్రానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కోడేరు గ్రామ శివారులో బొలెరో అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో బోల్తా పడిపోయింది. అతి వేగంగా వెళ్లడం ద్వారానే ప్రమాదానికి కారణమని తెలిపారు. ప్రస్తుతం గాయపడిన వారందరూ నాగర్ కుర్నూల్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బొలెరో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. గాయపడిన వారందరూ జిల్లా ఆసుపత్రికి రాగా వాళ్లని ఆస్పత్రి లోపలికి తీసుకు వెళ్లడానికి వార్డ్ బాయి లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. బొలెరోలో నిత్యం కూలీలను పరిమితికి మించి ఎక్కించుకొని వెళ్తున్న ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

Similar News