బాలకార్మిక వ్యవస్థ సామాజిక సమస్య.. కలెక్టర్ విజయేందిర

సమాజంలో బాలకార్మిక వ్యవస్థ పెద్ద సామాజిక సమస్యగా మారిందని, బాలకార్మికులను గుర్తించేందుకు అకస్మిక తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు.

Update: 2024-06-26 14:34 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : సమాజంలో బాలకార్మిక వ్యవస్థ పెద్ద సామాజిక సమస్యగా మారిందని, బాలకార్మికులను గుర్తించేందుకు అకస్మిక తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీతో నిర్వహించిన సమావేశంలో ఆమె అధికారులతో మాట్లాడారు. ముఖ్యంగా జిల్లాలోని వివిధ మండలాల్లో హోటళ్ళు, నిర్మాణ రంగంలో, భిక్షాటన, ఇటుక బట్టీలు లాంటి ఇతర చోట్ల ప్రమాదకర పనిచేయించే అవకాశం ఉందని, ఆ ప్రాంతాల్లో బాల కార్మికులను గుర్తించేందుకు కార్మిక శాఖ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ అధికారి సమన్వయంతో కలిసి తనిఖీలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు.

14 సంవత్సరాలలోపు కాని, 14 నుంచి 18 ఏళ్ల లోపు బాలబాలికలను పనిలో పెట్టుకున్న, వారిని లౌంగికంగా వేధించిన, బాలల సంరక్షణ అధికారికి గాని చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి సమాచారాన్ని అందించాలని ఆమె తెలిపారు. కౌమార దశలో ఉన్న బాలకార్మికులను గుర్తిస్తే వారిని పనిలో నియమించిన వారిపై 2016 చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని, వారిని బాలల సంరక్షణ కమిటీకి అప్పగించి వారి సంక్షేమం కోసం కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడు, జీఎం.బాబురావు, కార్మిక సహాయ కమిషనర్ స్వామి, డీఎంహెచ్ఓ డాక్టర్.కృష్ణ, షెడ్యూల్డు కులాల శాఖ డీడీ పాండు, గిరిజన అభివృద్ధి అధికారి చత్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Similar News