దిశ, అలంపూర్ టౌన్: తల్లి చనిపోయిన విషయాన్ని దాచిపెట్టి.. 47 నెలలుగా పింఛన్ డ్రా చేసుకున్న ఉట్కూర్ సర్పంచ్‌పై సస్పెండ్ వేటుపడింది. వివరాల్లోకి వెళితే.. తల్లి చనిపోయిన విషయాన్ని అధికారులకు చెప్పకుండా.. ఉట్కూర్ సర్పంచ్ అయ్యస్వామి 47 నెలలుగా పింఛన్ డ్రా చేసుకున్నాడు. అలంపూర్ మండలం ఉట్కూర్‌కు చెందిన మద్దెల లింగమ్మ 2019 ఫిబ్రవరి లో చనిపోయారు.
కానీ, ఆమె చనిపోయిన కూడా ప్రతి నెల ఆసరా పింఛను డ్రా అవుతున్నట్టు గ్రామస్తులు గుర్తించారు. దీంతో జిల్లా అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు గ్రామంలో విచారణ చేయగా.. విచారణ లో నిజం అని తేలడంతో.. ఉట్కూర్ సర్పంచ్ అయ్య స్వామి ని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి కవిత ను గురువారం సస్పెండ్ చేసినట్లు ఎంపీడీఓ నాగ శేషాద్రి సూరి తెలిపారు.