Special buses : పంచరామ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలకు నల్గొండ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినట్లు హలియా బస్టాండ్ కంట్రోలర్ సంపత్ కుమార్ తెలిపారు.

Update: 2024-11-04 14:35 GMT

దిశ,హాలియా : ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలకు నల్గొండ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినట్లు హలియా బస్టాండ్ కంట్రోలర్ సంపత్ కుమార్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో పంచరామ క్షేత్రాల స్పెషల్ బస్సు సౌకర్యం వివరాలను తెలిపే పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 3వ తేదీ 17 వ తేదీల్లో డీలక్స్ బస్సు నల్గొండ నుంచి రాత్రి ఎనిమిది గంటలకు బయల్దేరి పంచరామ క్షేత్రాలైన అమరావతి,బీమవరం,పాలకొల్లు,ద్రాక్షారామం,సామర్ల కోట తదితర ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. పెద్దలకు రూ.2వేలు పిల్లలకు రూ. 1300 ఛార్జిలు నిర్ణయించినట్లు తెలిపారు. బస్సు సౌకర్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమం లో నరహరి, శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


Similar News