ప్రయాణికుల ఇక్కట్లు

దసరా పండుగ అంటే తెలంగాణలో ప్రజలందరూ ఎంతో ప్రాముఖ్యత తో జరుపుకుంటారు.

Update: 2024-10-14 09:52 GMT

దిశ అచ్చంపేట రూరల్: దసరా పండుగ అంటే తెలంగాణలో ప్రజలందరూ ఎంతో ప్రాముఖ్యత తో జరుపుకుంటారు. ఎక్కడున్నా సరే.. పండగకు మాత్రం  ప్రజలందరూ తమ సొంత ఊర్లకు చేరుకుంటారు. అయితే మళ్లీ తిరుగు ప్రయాణంలో విద్యార్థులు స్కూల్స్,హాస్టల్ కు ,పెద్దలు వారు వృత్తిరీత్యా వుండే స్వస్థలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ యాజమాన్యం వారికి తిరుగు ప్రయాణానికి అవసరమైన బస్సులను కల్పించాల్సి ఉంటుంది. కానీ అచ్చంపేట డిపోలో బస్సులు లేక పిల్లలు, పెద్దలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. అదేవిధంగా ప్రజలు బస్సుల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇదే అదునుగా ఆర్టీసీ యాజమాన్యం ఒక్క టికెట్టు పై అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అచ్చంపేట నుంచి హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాప్ వరకు ఇదివరకు 210 గా ఉన్న టికెట్ ధర.. ప్రస్తుతం స్పెషల్ బస్సుల పేరిట 330గా పెంచి ప్రజలపై తీవ్రభారం మోపుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.

Similar News