జాకీ పెట్టి లేపిన లేవని పార్టీ బీఆర్ఎస్ : ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

జాకీ పెట్టి లేపిన లేవని పార్టీ బీఆర్‌ఎస్‌దని, అరువు తెచ్చుకుని అభ్యర్థులను ప్రకటించుకునే దుస్థితి బీజేపీదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు.

Update: 2024-03-14 12:09 GMT

దిశ, కొల్లాపూర్:  జాకీ పెట్టి లేపిన లేవని పార్టీ బీఆర్‌ఎస్‌దని, అరువు తెచ్చుకుని అభ్యర్థులను ప్రకటించుకునే దుస్థితి బీజేపీదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. గురువారం కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో పాదయాత్ర నిర్వహించి మహనీయుల విగ్రహాలకు పూలమాలవేసి సింగోటం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేసి కొల్లాపూర్ ఖాదర్ బాషా దర్గాలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ… రేవంతన్న దండుగా ప్రజాపాలనకు అండగా ఉందని ఎల్లుండి నాగర్ కర్నూల్ పార్లమెంట్‌కు నరేంద్ర మోదీ గారికి అడుగు పెట్టే నైతిక హక్కు లేదని, నాగర్ కర్నూల్ పార్లమెంట్‌లో ఏ ఒక్కరిని ఆదుకోలేదని, అభివృద్ధి చేయని వాళ్ళు ఏ రకంగా ఈ గడ్డ మీద అడుగు పెడుతున్నారో, వాళ్లకున్న నైతిక హ క్కేందో తెలియజేయాలని వారు వాళ్ళు డిమాండ్ చేశారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బచ్చలకూర బాలరాజ్, ధర్మ తేజ సింగోటం సర్పంచ్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Similar News