రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించాలి.. పీఏసీఎస్ ఛైర్మెన్

రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రహించాలనీ పీఏసీఎస్ ఛైర్మెన్ హన్మంతు రెడ్డి అన్నారు.

Update: 2024-11-21 07:14 GMT

దిశ, లింగాల : రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రహించాలనీ పీఏసీఎస్ ఛైర్మెన్ హన్మంతు రెడ్డి అన్నారు. గురువారం లింగాల, మండలంలోని అంబటిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ హన్మంతు రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని రైతులను కోరారు. సన్నవడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్విండొ చెర్మన్, డైరెక్టర్ వెంకట్ రెడ్డి, సింగిల్ విండో సొసైటీ కార్యదర్శి పాండు, ఏఈఓ శివనందు, మాజీ మార్కెట్ కమిటీ డైరక్టర్ బంగారయ్య, మదవులు గౌడ్, గ్రామ రైతులు పాల్గొన్నారు.


Similar News