పొలానికి వెళ్లిన మహిళ అదృశ్యం
పొలానికి వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన హన్వాడ మండల పరిధిలోని వెంకటమ్మకుంట తాండాలో చోటుచేసుకుంది.
దిశ, హన్వాడ : పొలానికి వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన హన్వాడ మండల పరిధిలోని వెంకటమ్మకుంట తాండాలో చోటుచేసుకుంది. హన్వాడ ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల మేరకు..హన్వాడ మండలం వెంకటమ్మకుంట తాండాకు చెందిన ఇస్లావత్ మన్నీబాయి (46) ఈ నెల 1 న ఉదయం భర్త వెంకటయ్య తో కలిసి పొలానికి వెళ్ళింది. బయటకు వెళ్ళొస్తా అని వెళ్ళి తిరిగి రాలేదు. భర్త పొలం చుట్టుప్రక్కల మన్నీబాయి కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం భర్త వెంకటయ్య తన భార్య ఈ నెల 1 వ తేదీ నుంచి కనిపించడం లేదని హన్వాడ పోలీసులను ఆశ్రయించాడు. భర్త వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.