పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మద్దూరు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
దిశ,చిన్న చింతకుంట : పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మద్దూరు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై ఆర్ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన గువ్వల విజయ్ కుమార్(17) గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో భరించలేక మంగళవారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని తల్లి గువ్వల మన్నెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆర్ శేఖర్ తెలిపారు.