బస్సు వస్తే బడికి.. లేకుంటే ఇంటికే

సరైన సమయంలో బస్సులు రావడం లేదని విద్యార్థులు నిరసనకు దిగారు. మంగళవారం స్థానిక చెక్ పోస్ట్ వద్ద విద్యార్థులు బస్సు సమయానికి రావడం లేదని ధర్నా చేశారు.

Update: 2024-12-03 13:12 GMT

దిశ, ఊట్కూర్: సరైన సమయంలో బస్సులు రావడం లేదని విద్యార్థులు నిరసనకు దిగారు. మంగళవారం స్థానిక చెక్ పోస్ట్ వద్ద విద్యార్థులు బస్సు సమయానికి రావడం లేదని ధర్నా చేశారు. విద్య బోధన కొరకు జిల్లా కేంద్రమైన నారాయణ పేటకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, బస్సులు సమయాపాలన పాటించకపోవడంతో కళాశాల, పాఠశాలలకు వెళ్లేందుకు అంతరాయం కలుగుతుందని విద్యార్థులు ఆరోపించారు. పది రోజుల వ్యవధిలో పలుమార్లు ధర్నాలు నిర్వహించిన ఫలితం లేదని వాపోయారు. బస్సులు సమయానికి రాకపోవడంతో ప్రైవేట్ వాహనాలకు డబ్బులు లేకపోవడంతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పరీక్షల సమయంలో బస్సుల సమస్య ఉంటే అధికారులు కనీసం పటించుకొర అని ప్రశ్నించారు. బస్సుల సంఖ్యను పెంచాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.


Similar News