పదవులు లేకున్నా ప్రజా సంక్షేమం కోసం పోరాడుతాం.. ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్

పదవులు లేకున్నా ప్రజాసంక్షేమం కోసం అహర్నిశలు పోరాడుతామని ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Update: 2024-07-04 13:30 GMT

దిశ, బిజినేపల్లి : పదవులు లేకున్నా ప్రజాసంక్షేమం కోసం అహర్నిశలు పోరాడుతామని ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో గురువారం ఎంపీటీసీ సభ్యుల ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించి మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో రాజకీయ నాయకుడిగా పదవులు రావడం పోవడం సహజమని ప్రజా సమస్యల పట్ల అనునిత్యం నిబద్ధత పనిచేసి పేదలకు న్యాయం చేశామన్న తృప్తి సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఐదేళ్ల పదవీకాలంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని మండల అభివృద్ధికి కృషి చేసినట్లు ఆయన అన్నారు. మండల అభివృద్ధిలో అధికారుల, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధుల సహకారం సంపూర్ణంగా అందిచ్చారని అన్నారు.

మండల గ్రామాల అభివృద్ధిలో కీలకంగా వివరించే అధికారులచే ప్రజలకు అవసరమైన సేవలను ప్రణాళికాబద్ధంగా ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ చేయించానని గుర్తు చేశారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజాస్వామ్యంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం తమ వంతుగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. అనంతరం అధికారులు ఎంపీపీ వైస్ ఎంపీపీ 19 మంది ఎంపీటీసీ సభ్యులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జిల్లా భూగర్భ జల శాఖ అధికారి రమాదేవి, ఎమ్మార్వో శ్రీరాములు, ఎంపీడీవో కతాలప్ప, ఎంపీఓ రాముల నాయక్, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి ఎంపీటీసీలు సుహాసన్ రెడ్డి, ఆంజనేయులు, బత్తిని తిరుపతిరెడ్డి, రాధా తిరుపతిరెడ్డి, సోములమ్మ, రఘుమారెడ్డి, చీర్ణం బాలస్వామి, నాగమ్మ మల్లేష్, ఈర్ల సరోజమ్మ, వేముల తిరుపతయ్య, చంద్రలేఖ, శ్రీశైలం, దేవేంద్రమ్మ, లక్ష్మీ గోపీనాయక్, ఉషన్న, పొట్టల జ్యోతి తదితరులు ఉన్నారు.


Similar News