భర్త, అత్తమామల వేధింపులతో వివాహిత ఆత్మహత్య

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మాలపల్లి గ్రామంలో భర్త, అత్తమామల వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.

Update: 2024-03-13 16:06 GMT

దిశ, కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మాలపల్లి గ్రామంలో భర్త, అత్తమామల వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. కొత్తకోట ఎస్ఐ మంజునాథ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పానగల్ మండలం, బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య తన కుమార్తె సరిత(26)ను 8 సంవత్సరాల క్రితం కొత్తకోట మండలం ముమ్మాళ్ళపల్లి గ్రామానికి చెందిన మారుతి కిచ్చి వివాహం జరిపించారు. వీరికి ఒక బాబు, ఒక పాప సంతానం ఉన్నారు. వివాహం జరిగిన నాటి నుంచి అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని పలుమార్లు కుమార్తె సరిత తమతో బాధ పంచుకుందని తండ్రి కృష్ణయ్య వివరించారు.

ఇరుపక్షల గ్రామ పెద్దలతో సర్ది చెప్పే ప్రయత్నం చేసిన, భర్త ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు భర్త అత్తమామలు వాళ్ళ పిల్లలతో వాళ్ళ బంధువులు పెళ్లికి వెళ్ళగా మృతురాలు ఒకటే ఇంట్లో ఉండటంతో తీవ్ర మనస్తాపం చెంది మృతురాలు సరిత నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగువారు గమనించి కుటుంబ సభ్యులకు, బంధువులందరికీ తెలియజేసారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భర్త అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం వలన తన కూతురు సరిత ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మంజునాథ రెడ్డి తెలిపారు.


Similar News