విద్యార్థుల కోసం మంచు లక్ష్మి

విద్యాదానం మహాదానమని సిని నటీ మంచు లక్ష్మీ అన్నారు.

Update: 2024-10-21 12:28 GMT

దిశ, గట్టు : విద్యాదానం మహాదానమని సిని నటీ మంచు లక్ష్మీ అన్నారు. టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో.. గట్టు మండలం ఆలూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులు ఆమె ప్రారంభించారు. గత ఏడాది జోగులాంబ గద్వాల జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చినట్లు టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ మంచులక్ష్మీ తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్య, కంప్యూటర్ క్లాస్ తదితర మౌలిక వసతులు కల్పించడమే ఈ సంస్థ ఉద్దేశమన్నారు. వెనుకబడిన ప్రాంతాలు ఎక్కడైనా ఉన్నట్లు సమాచారం అందిస్తే తాము అక్కడికి వెళ్లి పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామని ఆమె వెల్లడించారు. మండలంలో 21 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు డిజిటల్‌ విద్యను ఆందిచటమే టీచ్ ఫర్ చేజ్ సంస్థ లక్ష్యఉంది మన్నారు. గతంలో 30 ఇప్పుడు 21, మొత్తం 51పాఠశాలను సంస్థ డిజిటల్ విద్యా ఆందిచి..వెనుకబడిన మండలంను ముందుచడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఇజిఎ చైర్మెన్ దరణి కొట ,సుయెదన చిఫ్ పొగ్రామింగ్ ఆఫీసర్ ఐశ్వర్య , డిఇ ఓ రవీందర్ ఎంఇఓ నల్ల రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు రామన్ గౌడుమండల కొఅర్డినేటర్ నాగేష్, విద్యార్థులు ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Similar News