రైతు పండుగ.. రైతు సభను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

ఈనెల 30న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే రైతు పండుగ, రైతు భారీ బహిరంగ సభను నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మీడియాకు ఒక వీడియోను విడుదల చేశారు.

Update: 2024-11-27 09:54 GMT

దిశ, అచ్చంపేట : ఈనెల 30న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే రైతు పండుగ, రైతు భారీ బహిరంగ సభను నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మీడియాకు ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గడిచిన ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం మరే రంగానికి లేని విధంగా వ్యవసాయ రంగానికి అధిక మొత్తం నిధులు కేటాయించిందన్నారు. ముఖ్యంగా రైతు రుణ మాఫీతో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో కనీసం 20 వేల మంది నుంచి 30 వేల మంది రైతులకు లబ్ది పొందారన్నారు. గతంలో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతుల పక్షపాతిగా ఎలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడో అంతకంటే రెట్టింపుగా సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమ కోసం కృషి చేస్తున్నాడని పేర్కొన్నారు.

కావున ఈ ప్రభుత్వం ద్వారా రైతులకు పెద్ద ఎత్తున చేకూరిన ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, ఆదర్శ రైతుల ప్రసంగాలు, ఈ రైతు సదస్సులో ప్రధాన అంశాలుగా ఉంటాయన్నారు. ఈనెల 28 న ఉదయం 10 గంటలకు ఈ రైతు సదస్సు ప్రారంభమవుతుందని, మొదటి రోజు సదస్సుకు రైతులు హాజరవుతారని, ప్రారంభ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తాను ప్రారంభిస్తానని, ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు హాజరవుతారు. రెండో రోజైన 29న మహబూబ్ నగర్ జిల్లా యేతర ప్రాంతాల నుండి రైతులు హాజరవుతారని, 30 న రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి కనీసం లక్ష మంది రైతులు ఈ రైతు సదస్సుకు హాజరవుతారని వివరించారు. మొదటి రెండు రోజులు రోజు 5 వేల మంది చొప్పున రైతులు హాజరవుతారని చివరన 30 న తేదీన సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు అచ్చంపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్ట గోపాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.


Similar News