మక్తల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జాతీయ జెండా ఆవిష్కరణ..
మక్తల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాని పురస్కరించుకొని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
దిశ, మక్తల్ : మక్తల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాని పురస్కరించుకొని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు అతిపురాతనమైన పడమ ఆంజనేయ స్వామికి. ఆలయ ధర్మకర్త ప్రాణేశాచారి రాష్ట్ర సీఎం కేసీఆర్. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పేర్ల మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని పోలీసు సర్కిల్ ఆఫీస్, మున్సిపల్, తహసీల్దార్, రిజిస్ట్రేషన్, ఆసుపత్రి, వ్యవసాయ మార్కెట్ యార్డు, ఎంపీడీవో కార్యాలయం, ఇరిగేషన్, అధికారులు జెండా ఆవిష్కరణ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలు పూర్తీ చేసుకొని పదవ సంవత్సరం లోకి అడుగిడుతున్న శుభసందర్భంలో జూన్ 2 వతేది నుండి 22 వ తేదీ వరకు జరుగు దశాబ్ది ఉత్సవాల్లో అదికారులు. ప్రజలను భాగస్వాలుచేసి జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. మక్తల్ నియోజక వర్గంలో వివిధ పథకాల ద్వారా సాధించిన అభివృద్ధి సాగునీటిలో సాధించిన అభివృద్ధి. రెండు రిజర్వా యర్ల ద్వారా కృష్ణాపరివాక ప్రాంతంలో లిఫ్ట్ ల ద్వారా, చెరువులు నింపడం ద్వారా బీడు భూములకు సాగునీరు అందించి రైతులకు లబ్ధి చేకూర్చామని అన్నిరంగాల్లో అభివృద్ధి పురోగతిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీకార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.