Jurala project: జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు 20,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

Update: 2024-07-19 04:37 GMT

దిశ, ధరూర్: గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు 20,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 27,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 318.516 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 315.850 అడుగులు ఉంది. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.951 టీఎంసీలుగా నమోదైందని అధికారులు తెలిపారు. కాగా ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో ఈ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని.. ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News