అభివృద్ధి చేసిన వారికే పట్టం కట్టండి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గతంలో రెండున్నర ఏళ్ళు పనిచేసిన వ్యక్తి అభివృద్ధి చేశాడా ? లేక 10 ఏండ్లుగా నేను చేసిన అభివృద్ధి చేశానా ? చూడాలని, ఎవరి హయాంలో ఏ మేరకు అభివృద్ధి జరిగిందో చూసి వారికే పట్టం కట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థించారు.
దిశ,మహబూబ్ నగర్ : గతంలో రెండున్నర ఏళ్ళు పనిచేసిన వ్యక్తి అభివృద్ధి చేశాడా ? లేక 10 ఏండ్లుగా నేను చేసిన అభివృద్ధి చేశానా ? చూడాలని, ఎవరి హయాంలో ఏ మేరకు అభివృద్ధి జరిగిందో చూసి వారికే పట్టం కట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థించారు. గురువారం ఆయన స్థానిక బార్ అసోషియేషన్ లో న్యాయవాదులను ఉద్ధేశించి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడక ముందు ఉన్న మహబూబ్ నగర్, ఈ పదేళ్లలో అభివృద్ధి జరిగిన తర్వాత ఉన్నతేడాను గమనించాలని, హైదరాబాద్ లో మహబూబ్ నగర్ ను ఒక భాగంగా మారుస్తామని అన్నారు.
నియోజకవర్గం పట్ల తనకు సామాజిక బాధ్యత ఉందని, కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయంగా మంత్రి పేర్కొన్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే వారికి, కులాల కుంపట్లు రగిల్చే వారికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని మంత్రి కోరారు. మహబూబ్ నగర్ బ్రాండ్ వ్యాల్యూ పెంచడమే లక్ష్యంగా పనిచేస్తూ, మరింత అభివృద్ధి పై దృష్టి సారిస్తూ, న్యాయవాదులు, వ్యాపారస్తులు, వివిధ సామాజిక వర్గాలు, ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. బార్ కౌన్సిల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, కార్యదర్శి రాంనాథ్ గౌడ్, న్యాయవాదులు కే ప్రతాప్ కుమార్, చంద్రమౌళి, హనుమంతు, జాకీర్, టీ.వెంకటరామశర్మ, జగదీశ్వర్ రెడ్డి, స్వదేశ్ తదితరులు పాల్గొన్నారు.
తమ మద్ధత్తు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కే..
అన్నివిధాల మహబూబ్ నగర్ ను అభివృద్ధి పరచిన మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కే తమ సంపూర్ణ మద్ధత్తు ప్రకటిస్తున్నామని ఓయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ, జిల్లా సామిల్ అసోషియేషన్ అధ్యక్షుడు నవీన్ పటేల్, కార్యదర్శి ఎండి సిద్ధీఖీ తెలిపారు. గురువారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేర్వేరు కార్యక్రమంలో వారు తమ మద్ధత్తు ప్రకటించారు.