మక్తల్ నియోజకవర్గంలో మాగనూరు హై స్కూల్ సెగలు..

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులను ఈ తెల్లవారుజామున నుండి అరెస్టు చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Update: 2024-11-27 03:26 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులను ఈ తెల్లవారుజామున నుండి అరెస్టు చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ పది రోజుల్లో రెండు సార్లు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలు అయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ వరుస ఘటనల పట్ల ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం మరో మారు మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు మళ్లీ అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలు అయ్యారు.

ఈ విషయం పై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మీడియా సమక్షంలో అధికారుల తీరు పై ఘాటుగా వ్యాఖ్యానాలు చేశారు. దీనికి తోడు పలువురు విద్యార్థి సంఘాలు ధర్నాలు చేశారు. బుధవారం సైతం బీఆర్ఎస్ తోపాటు, పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని భావించి పోలీసులు తెల్లవారుజామున నుండి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఇతర పార్టీలు, సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని ఆయా పోలీస్ స్టేషనులకు తరలించారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని మద్దూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నియోజకవర్గంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడికి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.


Similar News