రాజ్యాంగ విలువలను కాపాడాలి.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి

భారత రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులు, విధుల పట్ల పౌరులంతా అవగాహనతో మెలుగుతూ వాటి విలువలను కాపాడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సూచించారు.

Update: 2024-11-27 03:00 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : భారత రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులు, విధుల పట్ల పౌరులంతా అవగాహనతో మెలుగుతూ వాటి విలువలను కాపాడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సూచించారు. మంగళవారం జిల్లా కోర్టు సముదాయంలోని న్యాయ సేవా సదన్ సమావేశ మందిరంలో నిర్వహించిన 'న్యాయ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ప్రస్తుతం రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ల నుండి బయటపడాలంటే ప్రజలలో చైతన్యం రావాలని, సర్వోన్నతమైన రాజ్యాంగ విలువలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు న్యాయమూర్తులు కె.కళ్యాణ్ చక్రవర్తి, వి.శారదా దేవి, ఆర్.శ్రీదేవి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఇందిర, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.సుదర్శన్ రెడ్డి, జీపీ శ్రీనివాసులు గౌడ్ తదితర న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News