మాగనూరు సంఘటన పై సీఎం సీరియస్..

మాగనూరు హై స్కూల్లో వారం రోజుల్లో మూడు సార్లు మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థుల అస్వస్థత కావడం పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యాడని ఈ విషయం పై లోతైన ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశించినట్లు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు.

Update: 2024-11-27 04:50 GMT

దిశ, మక్తల్ : మాగనూరు హై స్కూల్లో వారం రోజుల్లో మూడు సార్లు మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థుల అస్వస్థత కావడం పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యాడని ఈ విషయం పై లోతైన ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశించినట్లు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. ఇందులో బాధ్యులైన వారు ఎంతటి వారైనా శిక్షించక తప్పదని ఆయన అన్నారు. మంగళవారం మధ్యాహ్నం మాగనూరు హై స్కూల్లొ ఫుడ్ పాయిజన్ సంఘటన జరిగేన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంగళవారం రాత్రి పది గంటల సమయంలో మక్తల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, విద్యార్థులకు ధైర్యం చెప్పారు.

విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించాడు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థను గాడిన పడిందని పాఠశాలలో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగిందని. ఉపాధ్యాయులు, భర్తీ, బదిలీలు, ప్రమోషన్లు, మధ్యాహ్నం ఇతరత్రా విషయాలన్నింటిని చక్కదిద్దామని జరిగిన సంఘటన పునరావతం కాకుండా ఉండేందుకు స్థానిక తహశీల్దార్ ఇతర అధికార్లతో పర్యవేక్షణలో ఉన్నా వారం రోజులుగా మిడ్డేమిల్స్ మూడుసార్లు ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. జరిగిన సంఘటన పై బాధ్యులు ఎవరన్నది నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఆదేశించారని, బాధ్యులు ఎవరన్నది ఎంతటి వారైనా వారి పై కఠినంగా శిక్షిస్తామని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ సహకరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుల లక్ష్మారెడ్డి రవికుమార్, కట్ట సూరి వెంకట్, పాల్గొన్నారు.


Similar News