ప్లాట్లు కొన్న బాధితులకు న్యాయం చేయండి..

నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో సర్వేనెంబర్ 219/ఈ, 219 /బీ లో గల ప్లాట్లను గతంలో 2010 లో కుక్కల గోపాల్, కుక్కల సుమిత్రలు ప్లాట్లు చేసి విక్రయించారు.

Update: 2023-04-16 11:42 GMT

దిశ, మద్దూరు: నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో సర్వేనెంబర్ 219/ఈ, 219 /బీ లో గల ప్లాట్లను గతంలో 2010 లో కుక్కల గోపాల్, కుక్కల సుమిత్రలు ప్లాట్లు చేసి విక్రయించారు. దాదాపు 36 ప్లాట్లను పలువురు కొనుగోలు చేశారు. 10 మంది వరకు ఇంటి నిర్మాణాలు చేసుకొని నివాసముంటున్నారు. ఇంకా దాదాపు 20 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అందులో ఇంటి నిర్మాణాలు చేయాలని ప్లాట్లు కొనుగోలు చేసిన లబ్ధిదారులు పనులు ప్రారంభించడానికి వెళ్లగా మద్దూరుకు చెందిన కుక్కలరాజు తదితరులు వచ్చి ఈ భూమి తమదని ఇందులో నిర్మాణాలు చేయొద్దని పనులను అడ్డుకున్నారు.

ఇరువురి మధ్య గొడవ జరుగగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మూడు రోజుల్లోపు ఉన్న ఆధారాలను చూపిస్తామని కుక్కల రాజు లబ్ధిదారులకు తెలుపగా దానికి అంగీకరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్నో కష్టాలు పడి తాము ప్లాట్లు కొనుగోలు చేశామని, ఇప్పుడు నిర్మాణాలు చేయకుండా అడ్డుకుంటున్నందుకు చాలా నష్టపోతున్నామని తెలిపారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Tags:    

Similar News