పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత ప్రయాణం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థినీ విద్యార్థులకు జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోల బస్సులో ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తున్నట్లు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వి. శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-03-13 15:58 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థినీ విద్యార్థులకు జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోల బస్సులో ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తున్నట్లు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వి. శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే పదో తరగతి రాసే బాలికలు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును కండక్టర్‌కు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని, బాలురు మాత్రం తమ హాల్ టికెట్/రూట్ పాస్/ఫ్రీ స్టూడెంట్ బస్ పాస్‌లలో ఏదైనా ఒక దానిని కండక్టర్‌కు చూపించి తమ గమ్యస్థానం నుంచి పరీక్షలు రాసే బస్ స్టాండ్ వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పరీక్షలు రాసే విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఎం తెలిపారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితమైన ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


Similar News