సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కిన ఇంజనీరింగ్ విద్యార్థులు
సమస్యలను పరిష్కరించాలని వనపర్తి జేఎన్ టీయు ఇంజనీరింగ్ విద్యార్థులు ధర్నా చేపట్టారు.
దిశ,వనపర్తి : సమస్యలను పరిష్కరించాలని వనపర్తి జేఎన్ టీయు ఇంజనీరింగ్ విద్యార్థులు ధర్నా చేపట్టారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రం,నర్సింగాయ పల్లిలోని జెఎన్ టీ యు ఇంజనీరింగ్ కాళశాల విద్యార్థులు క్లాసులు బహిష్కరించి..కళాశాల ఆవరణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.అనంతరం రహదారిపై బైటయించి నిరసన విద్యార్థులు తెలిపారు. జేఎన్ టీయు ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభమై మూడు సంవత్సరాలు గడుస్తున్నా..కళాశాలలో మౌళిక వసతుల కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నాసిరకం సరుకులతో వంటలు వండి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల సమీపంలో బస్సు నిలిపేందుకు అర్టీసి సిబ్బంది నిరకరిస్తున్నారని, తాత్కాలిక వసతి కల్పించిన భవనంలో మరుగు దొడ్లు లేక విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించే వరకు ధర్నా విరమించమని విద్యార్థులు భీష్మించారు. ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారన్న భయంతో ఇన్నాళ్లు .సమస్యలతో విద్యాను కొనసాగిస్తున్నామని,ఓపిక నశించి గాత్యంతరం లేక నిరసన కార్యాలయం చేపడుతున్నామని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు చేపట్టిన ధర్నా కు ఏబీవిపి విద్యార్థి సంఘం,బీజేపీ పార్టీ మద్దతు తెలిపింది. వనపర్తి జిల్లా కలెక్టర్,జెఎన్టీయు ఉన్నత అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.