మినీ ట్యాంక్ బండ్ పైనే దసరా ముగింపు వేడుకలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇకనుండి ప్రతిఏటా దసరా ఉత్సవాల ముగింపు వేడుకలు పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Update: 2023-10-21 14:28 GMT

 దిశ,మహబూబ్ నగర్: ఇకనుండి ప్రతిఏటా దసరా ఉత్సవాల ముగింపు వేడుకలు పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్య సమాజ్ లో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మాట్లాడారు. దసరా ముగింపు ఉత్సవాలకు ఒక శాశ్వత వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు,దానికి మినీ ట్యాంక్ బండ్ బాగుంటుందని,బాణాసంచా కాల్చడం కూడా అక్కడే నిర్వహించాలని ప్రతిపాదనలు వచ్చాయని ఆయన తెలిపారు. పండుగ రోజు ఆర్యసమాజ్ నుంచి ఊరేగింపుగా బయలుదేరి క్లాక్ టవర్,అశోక్ టాకీస్ చౌరస్తా మీదుగా ట్యాంక్ బండ్ ఐలాండ్ వరకు చేరుకుంటుందని,అక్కడ స్వర లహరి కల్చరల్ అకాడమీ,దీప్తి శాస్త్రీయ నృత్య కళాశాలతో పలు సాంస్క్రతిక సంస్థల ద్వారా సాంస్కృతిక కార్య క్రమాలను నిర్వహిస్తామని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డా.వి.మురళీధర్ రావు,ముత్యాల ప్రకాష్,గోపాల్ యాదవ్,మోహన్ యాదవ్,రాజేశ్వర్ గౌడ్,మూడా చైర్మన్ గంజి వెంకన్న,మున్సిపల్ చైర్మన్ నర్సింహులు,గోపాల్ యాదవ్,గణేష్,శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News