ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు.

Update: 2024-11-25 10:30 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 45 ఫిర్యాదులు అందాయన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు..అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ..సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలివివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Similar News