ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ లో తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలి : కలెక్టర్ విజయేంద్ర బోయి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర ఇంటింటి
దిశ,జడ్చర్ల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను ఆన్లైన్ లో నిక్షిప్తం చేసే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.సోమవారం జడ్చర్ల లో డా.బి.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాల,శ్లోక పాఠశాలలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో సేకరించిన వివరాలు డేటా ఎంట్రీ కలెక్టర్ పరిశీలించారు.సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా సేకరించిన వివరాలను ఆపరేటర్లు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. నిబంధనలను పక్కాగా పాటిస్తూ, అన్ని వివరాలను ఆన్లైన్లో జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. త్వరితగతిన ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని, ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలకు ఆస్కారం లేకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆన్లైన్లో వివరాలు నమోదు సందర్భంగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురైనా, సాంకేతిక పరమైన సమస్యలు ఏవైనా ఉత్పన్నం అయితే, వెంటనే అధికారుల దృష్టికి తేవాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ బ్రాహ్మణ గౌడ్ ఎంపీడీవో మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ సిబ్బంది తదితరులు ఉన్నారు.