విధులకు ఆటంకం కల్పిస్తే కఠిన చర్యలు
విధులలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దురుసు ప్రవర్తన, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గద్వాల ఆర్టీసీ డిపో మేనేజర్ మురళీకృష్ణ తెలిపారు.
దిశ, గద్వాల టౌన్ : విధులలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దురుసు ప్రవర్తన, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గద్వాల ఆర్టీసీ డిపో మేనేజర్ మురళీకృష్ణ తెలిపారు. గత రాత్రి ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడి ఘటనలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బస్సు డ్రైవర్స్ పై దాడులు జరిపిన వారిని కఠినంగా శిక్షించాలని డిపో మేనేజర్ మురళీ కృష్ణ పేర్కొన్నారు. ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడితో..బస్సు లు నడపకుండా ఆందోళన చేశారని డిపో మేనేజర్ తెలిపారు. గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్ రావు హైర్ బస్సు ఓనర్స్, డ్రైవర్స్ తో చర్చించి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించి అన్ని బస్సులను నడిపించడం జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన పోలీస్ వారికీ బస్సు ఓనర్స్ కు, ఉద్యోగులకు డిపో మేనేజర్ మురళీ కృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులందరు మహాలక్ష్మి పథకం అమలు తర్వాత చాలా అంకిత భావంతో సేవలు చేస్తున్నారని,వారందరిని గౌరవించాలని ఎవరు కూడా అగౌరవంగా మాట్లాడితే వారిపై చర్యలు తప్పవని తెలిపారు.