విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
సమాజం నైతికతను ప్రభావితం చేసే విద్యా ,వైద్యంపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వం పెట్టిందని, అందులో భాగంగా మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ తెలిపారు.
దిశ,చారకొండ: సమాజం నైతికతను ప్రభావితం చేసే విద్యా ,వైద్యంపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వం పెట్టిందని, అందులో భాగంగా మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ తెలిపారు. మండలంలోని కేజీబీవీ కళాశాల అదనపు గదుల నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువు,విలువలే అసలైన ఆస్తులు అని, అందుకు విద్యార్థులు విద్యా ఫలితాలతో పాటు విద్యా ప్రమాణాలను సమానంగా సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం మంజూరు చేసిన 3.25 కోట్ల రూపాయలతో అదనపు గదుల నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు. కేజీబీవి పాఠశాల అధికారులు పాఠశాలలోని మౌలిక వసతులు లేని కారణంగా..ఉన్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన స్పందిస్తూ పాఠశాలలోని ప్రతి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గత సంవత్సరం ఉమ్మడి జిల్లాలో పదవ తరగతిలో ప్రథమ ఫలితాలు సాధించిన స్థానిక కేజీబీవీ విద్యార్థులను అభినందిస్తూ.. ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ఫలితాలు సాధించాలనే లక్ష్యంగా చదవాలని విద్యార్థులకు డీఈవో గోవింద రాజు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, ఎంఈవో ఝాన్సీ రాణి, కేజీ బీవీ ప్రత్యేక అధికారి మంజుల, ఎస్ వో మంజుల, సింగిల్ విండో చైర్మన్ జెల్ల గురువయ్య గౌడ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్ గౌడ్ ,మాజీ సర్పంచ్ గుండె విజెందర్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాల్ రాం గౌడ్, సీనియర్ నాయకుడు వెంకటయ్య యాదవ్,మాజీ ఎంపీ టిసీ లక్ష్మణ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.