సోమశిల ఆలయానికి పోటెత్తిన భక్తులు
కార్తీక మాసంలో చివరి సోమవారం సందర్భంగా..కొల్లాపూర్ మండలం సోమశిల పుణ్యక్షేత్రంలోనీ శ్రీ లలితాంభికా సోమేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు.
దిశ, కొల్లాపూర్: కార్తీక మాసంలో చివరి సోమవారం సందర్భంగా..కొల్లాపూర్ మండలం సోమశిల పుణ్యక్షేత్రంలోనీ శ్రీ లలితాంభికా సోమేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జాము నుంచే భక్తులు సోమశిలకు బారులు కట్టారు. సోమశిల సమీపంలోని సప్త నదుల సంగమ ప్రదేశంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తి శ్రద్ధలతో కార్తీకదీపాలను వెలిగించి నదిలో వదిలారు.అనంతరం భక్తులు శ్రీ లలితాంభిక సోమేశ్వర స్వామి ఆలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నారు. కొందరు భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. అయితే కొల్లాపూర్ నుంచి సోమశిల పుణ్యక్షేత్రానికి ఉదయం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపారు. సోమేశ్వరాలయం ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.