బీజేపీ పోరాటంతోనే కాంగ్రెస్ వెనక్కి తగ్గింది

బీజేపీ పోరాటంతోనే కొడంగల్ లో నిర్మింప తలపెట్టిన ఫార్మా సిటీ నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గిందని మహబూబ్ నగర్ ఎంపీ డికె అరుణ అన్నారు

Update: 2024-11-25 12:58 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: బీజేపీ పోరాటంతోనే కొడంగల్ లో నిర్మింప తలపెట్టిన ఫార్మా సిటీ నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గిందని మహబూబ్ నగర్ ఎంపీ డికె అరుణ  అన్నారు. పేదల పక్షాన పోరాటాలు చేస్తామనే లెఫ్ట్ పార్టీలు,లగచర్లలో రైతుల భూములు లాక్కొని ఫార్మా సిటీ నిర్మించాలని తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని లెఫ్టు పార్టీ నేతలు ఎందుకు వ్యతిరేకించలేదని ఆమె ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న సర్కారు మెడలు వంచింది బీజేపీ,లగచర్ల రైతులేనని ఆమె వక్కాణించారు. లగచర్ల,హాకీంపేట పరిసర గ్రామాల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని బేషరతుగా విడుదల చేయాలన్నారు. ఇండస్ట్రీలో కారిడార్ ను కూడా ప్రభుత్వ భూముల్లోనే ఏర్పాటు చేయాలని,కారిడార్ ఏర్పాటు ముసుగులో రైతుల భూములు లాక్కుంటామంటే తాను చూస్తూ ఊరుకునేది లేదని డికె అరుణ హెచ్చరించారు.


Similar News